Rudramadevi Movie Review

51 1 0
                                    

[http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/59810-anushka-rudramadevi-movie-highlight-fights-scenes.html Anushka Rudramadevi Movie Highlights] టైటిల్ చదవడానికి కాస్త షాకింగ్'గా వున్నా.. ప్రస్తుతం సినీఇండస్ట్రీలో అందరూ ఇలానే అనుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క భారీ ప్రతిష్టాత్మక-చారిత్రాత్మక 'రుద్రమదేవీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 3డీ స్టీరియోపిక్'లో ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఈ అమ్మడు చేసిన పోరాట సన్నివేశాలను చూస్తే.. ఎవరైనా ఆమెను ఆడమహిళగా గుర్తించరని, మగరాయుడిలా ఎంతో అద్భుతంగా నటించిందని అంటున్నారు ఆ మూవీ యూనిట్ సభ్యులు.

ఈ చిత్రంలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ వున్నాయట! అంతేకాదు.. ఓ పాత్రలో ఆమె పూర్తి మగరాయుడిలా కనువిందు చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో అనుష్క సారథ్యంలో సైన్యం శత్రరాజ్యంపై దండెత్తే ఎపిసోడ్ వుంది. ఆ మొత్తం సన్నివేశమే ఈ చిత్రానికి హైలైట్'గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు.. కొన్ని కీలక సన్నివేశాల్లో అనుష్క అచ్చం మగాడిలానే తన రుద్రరూపాన్ని చూపించినట్లుగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారని అంటున్నారు. ఆ వేషం సినిమాకే హైలైట్'గా నిలుస్తుందని అనుకుంటున్నారు.

నిజానికి ఆనాడు కాకతీయ సామ్రాజ్యంలో మొదటిసారిగా ఓ యువతికి కిరీటం అందించినప్పుడు ఆమెను మగాడిగానే పరగణించారు. రుద్రమదేవీ అని కాకుండా రుద్రదేవ అని ప్రస్థావించుకునేవారు. అందుకు తగ్గట్టుగానే ఆమె తన విధులు నిర్వర్తించి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అనుష్కని అదేవిధంగా చూపించారని అంటున్నారు. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో దగ్గుబాటి రానా నిడదవోలు చాళుక్యరాజుగా నటిస్తుండగా.. అల్లుఅర్జున్ గోనగన్నరాజు పాత్రలో కనువిందు చేయనున్నారు.

Click here for [http://www.teluguwishesh.com Latest Telugu Movie News, Tollywood Movie Reviews and Telugu Gossips]

You've reached the end of published parts.

⏰ Last updated: Jan 09, 2015 ⏰

Add this story to your Library to get notified about new parts!

Rudramadevi Movie ReviewWhere stories live. Discover now